లాక్‌డౌన్ కారణంగా నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిరుపేదలు, అనాథలకు పలు స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే నిత్యం ఆహారం పంపిణీ చేస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా నిరుపేదలకు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తినడానికి తిండి లేకుండా సహాయం కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు రూ. 13 కోట్లు విడుదల చేసింది టీటీడీ. అన్నప్రసాదం ట్రస్ట్ ద్వారా ఈ సాయాన్ని చేయాలని టీటీడీ నిర్ణయించింది. ప్రతి జిల్లాకు కోటి రూపాయాల చొప్పున అందించి, పేదల ఆకలి తీర్చనుంది టీటీడీ. ఈ నిధులను జిల్లా కలెక్టర్లకు అందజేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మే 3వ తేదీ వరకు భక్తులకు శ్రీవారి దర్శనాలు నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
ఆకలితో అలమటిస్తున్న వారికి టీటీడీ 13 కోట్ల సాయం