కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దాదాపుగా అన్ని దేశాలకు విస్తరించిన కరోనా వైరస్ తాజాగా మయన్మార్‌కు విస్తరించింది. ఈ దేశంలో మొదటి పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది. ఇదే విషయాన్ని మయన్మార్ అధికారికంగా ప్రకటించింది. అమెరికా నుంచి వచ్చిన 36 ఏండ్ల యువకుడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపింది. కాగా చైనాతో సరిహద్దును కలిగి ఉన్న మయన్మార్‌లో ఇదే మొదటి కేసు కావడం గమనార్హం. అటు బ్రిటన్ నుంచి వచ్చిన మరో ఇద్దరికి కరోనా లక్షణాలు ఉన్నాయి. వారితో సన్నిహితంగా ఉన్న పలువురిని పరీక్షంచనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.
మయన్మార్‌లో తొలి కరోనా కేసు